6.1 కోట్ల మంది ఇప్పటికే ఓటు హక్కును వినియోగించుకున్నారని అమెరికన్ మీడియా పేర్కొంది. మెయిల్, ముందస్తు ఓటింగ్ సౌకర్యాన్ని చాలా మంది వినియోగించుకున్నట్లు వెల్లడించింది. జార్జియా, నార్త్ కరోలినా ప్రాంతాల్లో డెమోక్రటిక్ అభ్యర్థి కమలాహారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ మధ్య పోటాపోటీ ఉన్నట్లు అంచనా వేసింది.