CTR: నగరి మండలం రామాపురం వద్ద సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికంగా రిపేరింగ్ షాపు నడుపుతున్న చిరంజీవి అనే వ్యక్తిని రేణిగుంట-చెన్నై హైవేపై లారీ ఢీకొట్టింది. ఆ తర్వాత కొంత దూరంగా లాక్కెళ్లింది. తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.