GNTR: దుగ్గిరాల మండలం మోరంపూడి గ్రామంలో పేకాట శిబిరంపై పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. ఎస్సై వెంకట రవి వివరాల మేరకు.. మండలంలోని మోరంపూడి పొలాల్లో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో దాడి చేసినట్లు చెప్పారు. ఈ దాడులలో 12 మంది జూదరులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ. 63,200 నగదును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.