CTR: ఐరాల మండలంలో చైన్ స్నాచర్స్ రెచ్చిపోయారు. గుండ్లపల్లె పంచాయతీ గొల్లపల్లె బస్టాప్ వద్ద గొల్లపల్లె గ్రామానికి నాగరత్నమ్మ ఆదివారం వేచి ఉన్నారు. అదే సమయంలో ఇద్దరు యువకులు బైకుపై వచ్చారు. ఆమె మెడలో ఉన్న సుమారు 36 గ్రాముల బంగారు చైన్ దోచుకెళ్లారు. మహిళ ఫిర్యాదు మేరకు ఎస్ఐ నరసింహులు కేసు నమోదు చేశారు.