TG: HYD అబిడ్స్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బాణాసంచా దుకాణంలో జరిగిన ప్రమాదంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. పక్కనే ఉన్న ఓ హోటల్‌కు మంటలు వ్యాపించడంతో ఆందోళన నెలకొంది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది. 3 ఫైరింజన్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. దేవాదాయ శాఖ కార్యాలయానికి సమీపంలోనే చోటుచేసుకున్న ఘటనలో 10కి పైగా బైక్‌లు దగ్ధమయ్యాయి. మంటలు ఎగసిపడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.