WGL: గోవిందరావుపేటలో నిర్వహించిన బీజేపీ సభ్యత్వ నమోదు రివ్యూ మీటింగ్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపే ప్రధాన లక్ష్యంగా ప్రతి కార్యకర్త అహర్నిశలు కష్టపడి పని చేయాలన్నారు. కార్యకర్తలకు పార్టీలో సముచిత ప్రాధాన్యత కల్పిస్తామన్నారు.