TG: జన్వాడ ఫామ్‌హౌస్ పార్టీపై మాజీమంత్రి కేటీఆర్ స్పందించారు. ‘కాంగ్రెస్ చేస్తున్న చిల్లర ప్రయత్నాలు, కేసులకు బయపడం. కుటుంబ సభ్యులపై కేసులు బనాయిస్తున్నారు. ఒక కుటుంబం ఇంట్లో దావత్ చేసుకుంటే తప్పా. కుట్రలతో మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. అది ఫామ్‌హౌజ్ కాదు.. నా బావమరిది ఇళ్లు. గృహప్రవేశం సందర్భంగా దావత్ ఇచ్చారు. కుటుంబం కలిస్తే రేవ్ పార్టీ అవుతుందా. సోదాలతో ఇబ్బంది పెడితే ఊరుకోం’ అని హెచ్చరించారు.