అన్నమయ్య: ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చడమే ఆర్టీసీ ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం రాయచోటి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో 10 నూతన ఆర్టీసీ బస్సులను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.