తమిళ దర్శకుడు సుందర్.సి తెరకెక్కించిన ఫ్రాంచైజీ ‘అరణ్మనై'(తెలుగులో ‘బాక్’). ఇప్పటికే ఈ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన నాలుగు భాగాలు మంచి విజయం అందుకున్నాయి. ఈ నేపథ్యంలో దీని ఐదో భాగం సిద్ధమైందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ వార్తలపై సుందర్ భార్య, నటి ఖుష్బూ క్లారిటీ ఇచ్చారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.