అసిస్టెంట్ లేడీ కొరియోగ్రాఫర్‌పై లైంగిక ఆరోపణల కేసులో జైల్లో ఉన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాను ఇంకా జైల్లోనే ఉన్నట్లు అనిపిస్తుందని జానీ తన సన్నిహితులతో చెప్పినట్లు తెలుస్తోంది. ‘జైల్లో ఫుడ్ తినలేకపోయాను. మనిషి అనేవాడు ఎప్పుడూ జైలుకు వెళ్లకూడదు. బయట కంటే జైల్లో నరకంగా ఉంటుంది. త్వరలోనే అన్ని విషయాలను బయటపెడతా’ అని చెప్పినట్లు సమాచారం.