మెగాస్టార్ చిరంజీవి డిగ్రీ రోజుల్లోనే నటుడిగా మారారు. డిగ్రీ సెకండియర్ చదువుతున్న సమయంలో ‘రాజీనామా’ అనే నాటకం వేశారు. ఆనాటి ఫొటోను చిరు తాజాగా ఇన్‌స్టాలో షేర్ చేశారు. ‘1974-75 టైంలో నర్సాపూర్‌లోని YNM కాలేజీలో ‘రాజీనామా’ పేరుతో తొలి నాటకాన్ని వేశాను. దానికి గానూ బెస్ట్ యాక్టర్ ఆఫ్ కాలేజీగా తొలి అవార్డ్‌ను అందుకున్నాను. 1974-2024 వరకు 50 ఏళ్ల నట ప్రస్థానం.. ఎనలేని ఆనందం’ అని పేర్కొన్నారు.