ప్రకాశం: యర్రగొండపాలెం మండలం సాయిబాబానగర్లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం స్థావరంపై మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట్ త్రీవినాగ్ మెరుపు దాడి చేశారు. లారీలో అక్రమంగా 600 బస్తాల రేషన్ బియ్యం లోడ్ చేస్తుండగా మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట్ త్రివినాగ్ అడ్డుకున్నారు. ఈ దాడుల్లో 600 బస్తాల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.