TG: ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మరవాయి గ్రామానికి చెందిన ప్రముఖ గుస్సాడీ నృత్య కళాకారుడు, పద్మశ్రీ గ్రహీత గుస్సాడీ కనకరాజు (70) నిన్న అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కనకరాజు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో జరపాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.