కృష్ణ: ప్రయాణీకుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా దానాపూర్(DNR)-SMVT బెంగుళూరు(SMVB) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నవంబర్ 3న నం.06235 SMVB-DNR రైలును, నవంబర్ 9న నం.06236 దానాపూర్-SMVT బెంగుళూరు రైలును నడుపుతామని ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీలో విజయవాడతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతాయన్నారు.