ఐపీఎల్ భవితవ్యంపై టీమిండియా మాజీ కెప్టెన్ MS ధోని కీలక వ్యాఖ్యలు చేశాడు. ఓ ప్రమోషనల్ కార్యక్రమంలో పాల్గొన్న మిస్టర్ కూల్ మరికొన్నేళ్లు క్రికెట్ ఆడేందుకు సన్నద్ధమవుతున్నానంటూ వెల్లడించాడు. దీంతో ధోని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో వచ్చే సీజన్‌తో పాటు మరో రెండేళ్లు సీఎస్కే తరఫున ధోని ఆడుతాడంటూ క్రీడా వర్గాల్లో కొత్త చర్చ నడుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే ధోని ఫ్యాన్స్‌కి పండగే.