KMM: జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిని మంగళవారం పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురాం రెడ్డి పరిశీలించారు. మెరుగైన సేవలు అందుబాటులో ఉండడానికి కావలసిన సౌకర్యాలు వివరాల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రోగులకు వెలువైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు శివరామకృష్ణ, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.