TG: సికింద్రాబాద్ కుమ్మరిగూడ ముత్యాలమ్మ ఆలయంపై దాడి ఘటనలో సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. ముత్యాలమ్మ ఆలయంపై దాడికి గల కారణాలు ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ర్యాలీలో పాల్గొన్న వారిపై కేసులు పెట్టడం సరికాదని పేర్కొన్నారు. కాగా, అంతకుముందు రాజాసింగ్ ముత్యాలమ్మ ఆలయానికి వెళ్లి మాట్లాడారు.