గ్లాస్గోలో జరగనున్న కామన్వెల్త్-2026 క్రీడల నుంచి హాకీ, రెజ్లింగ్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ గేమ్స్‌ను తొలగిస్తున్నట్లు నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు. 2022 బర్మింగ్ హామ్లో 19 క్రీడాంశాలతో ఈ మెగా ఈవెంట్ నిర్వహించగా.. ప్రస్తుతం వాటి సంఖ్యను కుదిస్తారని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు నిర్వాహకులు వాటి సంఖ్యను తగ్గిస్తున్నట్లు తాజాగా నిర్ణయం తీసుకున్నారు.