విజయనగరం: జామి మండలం జన్నివలసలో పారిశుద్ధ్య పనులు చురుగ్గా సాగుతున్నాయి. స్థానిక సర్పంచ్ చందు ఆధ్వర్యంలో మంగళవారం గ్రామంలో గల కాలువల్లో పూడికపోయిన మట్టిని తొలగించి రోడ్లను శుభ్రం చేశారు. బ్లీచింగ్ పిచికారి చేయించి, మంచినీటి పథకం ట్యాంకులో క్లోరినేషన్ చేయించారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యవంతమైన జీవనం సాగించాలని సర్పంచ్ కోరారు.