NLR: ఆత్మకూరు పట్టణంలో పోలీస్ స్టేషన్ నందు భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వివిధ వర్గాలచే మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఆత్మకూరు డీఎస్సీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రక్తదాన శిబిరంలో డివిజన్లోని పోలీసులు, పాఠశాల విద్యార్థులు, పట్టణ యువకులు, రాజకీయ నాయకులు భారీగా పాల్గొని రక్తాన్ని అందించారు.