JGL: వెల్గటూర్ మండలం ముక్కట్రావ్పేటకు చెందిన మండలకుస మొండయ్య సంవత్సర కాలంగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా.. చికిత్స పొందుతూ కరీంనగర్ ఆసుపత్రిలో శనివారం మృతి చెందాడు. నేడు మృతుడి కుమారుడు అనిల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ధర్మపురి వెల్గటూర్ పోలీసులు తెలిపారు.