న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో భారత్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ పేరిట ఓ చెత్త రికార్డ్ నమోదైంది. స్వదేశంలో అత్యధిక టెస్టులు ఓడిన టీమిండియా కెప్టెన్ల జాబితాలో కోహ్లీని అధిగమించి.. ధోని, సచిన్, గంగూలీ, బిషన్ సింగ్ బేడీ సరసన నిలిచాడు. స్వదేశంలో రోహిత్ కెప్టెన్సీలో టెస్ట్ మ్యాచ్ ఓడిపోవడం ఇది మూడో సారి. కోహ్లీ సారథ్యంలో కేవలం రెండు సార్లు మాత్రమే స్వదేశంలో భారత్ ఓటమి చవిచూసింది.