మహిళల టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో అమేలియా కెర్(43), సుజీ బేట్స్(32), బ్రూక్ హాలిడే(38) పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలలో నోన్కులులేకో మ్లాబా(2), అయాబొంగా ఖాకా, క్లో ట్రయాన్, నాడిన్ డి క్లెర్క్ తలో వికెట్ తీశారు. కాగా, దక్షిణాఫ్రికా విజయ లక్ష్యం 159 పరుగులు.