BPT: రైలు కిందపడి వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. బాపట్లలోని సాకలిపాలెం రైల్వే గేట్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి వందే భారత్ రైలు క్రింద పడి మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.