BPT: వాక్ ఫర్ ఫ్రీడం నిశ్శబ్ద నడక కార్యక్రమంలో బాపట్ల ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీ నందు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని జిల్లా రెవెన్యు అధికారి చందాల సత్తిబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలికలు, మహిళలు, చిన్నారులు నిత్యం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే హెల్ప్ లైన్ నంబర్ 1098, 181కు సమాచారం ఇవ్వాలన్నారు.