ఆడపిల్లలు ఈ మధ్య కాలంలో చిన్న వయసులోనే రజస్వల అవుతున్నారు. అయితే, ఇలా జరగడం వల్ల వారి ఆరోగ్యానికి ప్రమాదకరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే.. ప్రస్తుతం మనం తినే చికెన్, మటన్లో ఫెస్టిసైడ్స్ ఎక్కువగా ఉండటం, అలాగే పశువుల్లో పాల ఉత్పత్తిని పెంచడానికి హార్మోన్ ఇంజెక్షన్లు వేస్తున్నారు. ఆ పాలు తాగడం వల్ల పిల్లల శరీరంలోని హార్మోన్లతో సమతుల్యం దెబ్బతినడం ఈ సమస్యకు కారణమని వైద్యులు అంటున్నారు.