ప్రకాశం: కనిగిరి పట్టణంలోని అమరావతి గ్రౌండ్లో శుక్రవారం జనని చారిటబుల్ ట్రస్ట్, జిల్లా ఆందత్వ నివారణ సంస్థ, శంకర కంటి ఆసుపత్రి సంయుక్తంగా కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. వైద్యులు వృద్ధులకు కంటి పరీక్షలు నిర్వహించి ఆపరేషన్లకు ఎంపిక చేశారు. ఉచితంగా మందులు, కళ్ళజోళ్ళు పంపిణీ చేశారు.