W.G: మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిడదవోలు ప్రిన్సిపల్ సివిల్ జడ్జి జి.రామకృష్ణ సమిశ్రగూడెంలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని సందర్శించారు. పిల్లలతో మాట్లాడి వారికి అందుతున్న సదుపాయాలు గురించి ఆరా తీశారు. హాస్టళ్లల్లో స్థితిగతులను, వంట గదిని, వాష్ రూమ్లను పరిశీలించారు. హాస్టల్ నిర్వహణ సదుపాయాలను కల్పించాలని హాస్టల్ సిబ్బందిని ఆదేశించారు.