సాధారణంగా వంటల్లో పల్లి, సన్‌ఫ్లవర్ వంటి నూనెలు వాడుతారు. అయితే ఆలివ్ ఆయిల్ వాడకం ఆరోగ్య ప్రయోజనాలను పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆలివ్ ఆయిల్.. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆర్థరైటిస్ వల్ల కలిగే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. క్యాన్సర్, గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. జీర్ణక్రియ మెరుగుపడి, మలబద్ధకం దరిచేరదు. పోషకాల శోషణ పెరిగి శరీరానికి శక్తి అందుతుంది.