ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దసరా సెలవుల జాబితాను విడుదల చేసింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు అక్టోబర్ 3 (గురువారం) నుండి అక్టోబర్ 13 (శనివారం) వరకు దసరా సెలవులు ఉంటాయి. అక్టోబర్ 14 (సోమవారం) న అన్ని పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ విద్యా బోర్డు ఒక ప్రకటన విడుదల చేసింది.
ఇంకో వైపు, దేవి నవరాత్రి ఉత్సవాలు కూడా అక్టోబర్ 3 నుండి ప్రారంభమై అక్టోబర్ 12 వరకు కొనసాగుతాయి, ఈ ఉత్సవాలు విజయదశమి పండుగతో 12వ తేదీన ముగియనున్నాయి. దసరా పండుగ వేళ దుర్గాదేవి అమ్మవారిని వివిధ అలంకారాలలో దర్శించుకుంటారు భక్తులు. ఇది భక్తులకు ప్రత్యేక ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది.
దసరా ఉత్సవాలు సాంప్రదాయాలకు అనుగుణంగా మహిళల శక్తిని, ఆధ్యాత్మికతను, మరియు సమాజంలోని శుభం, శ్రేయస్సుకు చిహ్నంగా జరుగుతాయి. ఈ సమయంలో ప్రజలు దేవిని పూజించి, నవరాత్రి పూజలలో పాల్గొంటారు.