అఖిల భారత టెన్నిస్ సంఘం(ఐటా)లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఐటా అధ్యక్షుడు అనిల్ జైన్పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు 8 రాష్ట్రాల టెన్నిస్ సంఘాలు ఈరోజు సమావేశం ఏర్పాటు చేశాయి. అనిల్ జైన్ తన కుటుంబంతో చేసే విదేశీ పర్యటనల ఖర్చులను రాష్ట్ర సంఘాలపై మోపుతున్నారని అస్సాం, గుజరాత్, జమ్మూకశ్మీర్, హర్యానా, మహరాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, త్రిపుర సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీంతో ఆయనపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని ఆలోచిస్తున్నాయి.