అమెరికాకు చెందిన షానన్ రౌబరీకు 12 ఏళ్ల తర్వాత కాంస్య పతకం వరించనుంది. 2012 లండన్ ఒలింపిక్స్లో మహిళల 1500 మీటర్ల రన్నింగ్లో ఆరో స్థానంతో ఆమెకు పతకం చేజారింది. అయితే, ఫైనల్లో 13 మంది పాల్గొనగా.. డోపింగ్ పరీక్షల్లో ఐదుగురు ఫైనలిస్టులు పట్టుబడ్డారు. దీంతో పలువురిపై నిషేధం విధించడంతో షానన్.. జాబితాలో మూడో స్థానానికి చేరింది. ఇలా 12 ఏళ్ల తర్వాత షానన్ రౌబరీని కాంస్య పతకం వరించనుంది.