శ్రీలంక యువ ఆటగాడు కమిందు మెండిస్ టెస్ట్ క్రికెట్లో వీరవిహారం చేస్తున్నాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో సెంచరీ(182*)తో అదరగొట్టాడు. దీంతో టెస్టుల్లో కేవలం 13 ఇన్నింగ్స్‌లలోనే 1000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా డాన్ బ్రాడ్‌మన్ సరసన 3వ స్ధానంలో నిలిచాడు. తొలి రెండు స్ధానాల్లో ఇంగ్లండ్ ఆటగాడు హెర్బర్ట్ సట్‌క్లిఫ్(12), విండీస్ ఆటగాడు సర్ ఎవర్టన్ వీక్స్(12) ఉన్నారు.