ప్రకాశం: మార్కాపురం మండలం నికరం పల్లె గ్రామం ఊరికి దగ్గరలో విద్యుత్ స్తంభం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. గత 2నెలల నుంచి ఇలానే ఉందని, అసలే వర్షాకాలం కావడంతో ఎప్పుడు కూలిపోతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టీపట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఉన్నతాధికారులు నూతన స్తంభాన్ని బిగించాలని ప్రజలు కోరుతున్నారు