భారత్, బంగ్లాదేశ్ రెండవ టెస్ట్ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో 35 ఓవర్లకే తొలి రోజు ఆట ముగిసింది. బంగ్లాదేశ్ 3 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది.క్రీజులో మోమీనుల్ హక్ 40, ముష్ఫీకర్ రహీం 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. బంగ్లా బ్యాటర్లలో జకీర్ డక్ అవుట్, షద్మాన్ ఇస్లామ్ 24, షాంటో 31 పరుగులకు పెవిలియన్ చేరారు. భారత బౌలర్లలో ఆకాశ్ దీప్ 2, అశ్విన్ 1 వికెట్ తీశారు.