NLG: నార్కెట్ పల్లి మండల కేంద్రంలో రైతులతో కలిసి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులకు షరతులు లేకుండా రూ.2లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేసి రైతు భరోసా నిధులను విడుదల చేయాలని, ప్రభుత్వం రైతులకు, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.