HYD: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 28న నగరానికి రానున్నారు. శనివారం ఉ. 9 నుంచి సా. 7 గంటల వరకు సిటీలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని నగర ట్రాఫిక్ అదనపు కమిషనర్ విశ్వప్రసాద్ తెలిపారు. బేగంపేట్, HYD పబ్లిక్ స్కూల్, రసూలురా, టివోలి, కార్ఖానా, తిరుమలగిరి క్రాస్ రోడ్స్, లోతుకుంట, బొల్లారంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు.