NRML: మహిళల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజురా సత్యం అన్నారు. శుక్రవారం ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని శాంతినగర్లో ఉన్న మహిళల లబ్ధిదారులకు ప్రభుత్వం రూ. 500కే మంజూరు చేసిన గ్యాస్ సబ్సిడీ ధ్రువీకరణ పత్రాలను ఆయన అందజేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారెంటీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.