AP: టీటీడీ నియమ నిబంధనలు అందరూ పాటించాలని బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి వెల్లడించారు. ఈ రోజు ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అన్యమతస్థులు ఎవరైనా తిరుమలకు వస్తే స్వామిపై నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు.