NLR: కావలి పట్టణంలో శుక్రవారం అర్ధరాత్రి వేకువజామున ఎన్టీఆర్ అభిమానులు సందడి వాతావరణం చేశారు. తమ అభిమాన నటుడు జూనియర్ నందమూరి తారక రామారావు నటించిన దేవర చిత్రం విడుదల సందర్భంగా అభిమానులు టపాసులు పేల్చారు. కాసేపు కావలి పట్టణంలోని మానస థియేటర్ దగ్గర సందడి వాతావరణం నెలకొన్నది. జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ అని నినాదాలు చేశారు.