HYD: చాకలి ఐలమ్మ ఆశలకు అనుగుణంగా పనిచేయాలని విద్యార్థి సంఘ నాయకులు DSU భద్రన్న పిలుపునిచ్చారు. గురువారం OU ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో DSU కంచర్ల భద్రన్న ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో TDSF స్టేట్ ప్రెసిడెంట్ విజయ్ నాయక్, హంస నామ సైదులు పాల్గొన్నారు.