WG: జిల్లాలో గడిచిన 24 గంటల వ్యవధిలో 146.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు గురువారం తెలిపారు. జిల్లాలో అత్యధికంగా అత్తిలి 23.8, ఇరగవరం 18.0, భీమవరం 15.2, ఉండి 13.0, పాలకోడేరు 12.4, వీరవాసరం 10.4 మిల్లీమీటర్లు చొప్పున వర్షపాతం నమోదు కాగా జిల్లాలో అత్యల్పంగా ఆచంట, కాళ్ళ మండలాల్లో 1.0 చొప్పున నమోదయినట్లు తెలిపారు.