ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత మాజీ స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో కెప్టెన్ రోహిత్ శర్మపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ గొప్ప కెప్టెన్ అని.. సారథిగా అతడు దేశానికి ప్రపంచకప్‌ను అందించనందుకు సంతోషంగా ఉందని అన్నాడు. గతంలో కొన్నిసార్లు టైటిల్‌కు చేరువై తృటిలో చేజార్చుకున్నామని చెప్పాడు. కానీ రోహిత్ కెప్టెన్సీలో టీ20 ట్రోఫీని అందుకున్నామని అతనిపై ప్రశంసలు కురిపించాడు.