AP: సచివాలయంలో మైనారిటీ సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. ఈ సమావేశంలో మైనారిటీ సంక్షేమ పథకాల పునర్ వ్యవస్థీకరణపై చర్చించారు. కడప హజ్ హౌస్, గుంటూరు క్రిస్టియన్ భవన్ పూర్తికి ఆదేశాలు జారీచ చేశారు. అలాగే నూర్ బాషా కార్పొరేషన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఇమామ్లు, మౌజన్లకు రూ.10వేలు, రూ.5 వేలు గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించారు. ఇక వక్ఫ్ భూములు అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు.