WGL: వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ఎస్బీఐ బ్యాంకు ముందు రైతులు ధర్నా రాస్తారోకో చేశారు. బ్యాంకు సిబ్బంది రుణమాఫీ విషయంలో నెలల తరబడి తిప్పుతూ నిర్లక్ష్యం వహిస్తున్నారని ఉన్నతాధికారులు స్పందించి వెంటనే బ్యాంకు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జాతీయ రహదారిపై కూర్చుని ఆందోళన చేపట్టడంతో భారీగా వాహనాలు స్తంభించాయి.