మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్(MMA)లో భారత రెజ్లర్ సంగ్రామ్ సింగ్ తన అరంగేట్రాన్ని ఘనంగా ప్రారంభించాడు. MMA ఫైట్‌లో నెగ్గిన తొలి భారత పురుష రెజ్లర్‌గా ఘనత సాధించాడు. జార్జియాలో జరుగుతున్న గామా ఇంటర్నేషనల్ ఫైటింగ్ ఛాంపియన్‌షిప్‌లో 93 కేజీల కేటగిరీలో పాకిస్తాన్ ఫైటర్ అలీ రజా నాసిర్‌ను చిత్తు చేశాడు. ఫైట్ అనంతరం సంగ్రామ్ సింగ్ మాట్లాడుతూ.. ఈ గెలుపు వ్యక్తిగత విజయం కంటే చాలా ఎక్కువ అని అన్నాడు.