NRML: జైనుర్ మండలంలో జిల్లా ఆదివాసి మహిళపై అత్యాచారం, హత్య చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని తుడుం దెబ్బ ఆధ్వర్యంలో నిర్మల్ ఆర్డీవోకు శనివారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూమయ్య మాట్లాడుతూ ఆదివాసీలపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం అరికట్టాలని, బాధితులకు రక్షణ కల్పించాలని కోరారు.