ఆంధ్రప్రదేశ్ ను ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. జూలై 18, గురువారం ఉదయం నుంచి జులై 19, శుక్రవారం వరుకు కురిసిన భారీ వర్షాల వల్ల తీవ్ర పంట నష్టం, ఆస్తి నష్టం వాటిల్లింది. చాలా చోట్ల వాగులు ఉప్పొండగంతో రోడ్లు, కల్వర్టులు తెగిపోయాయి.
ఉత్తరాంధ్రలో వర్ష ప్రభావం తీవ్రంగా ఉంది. విజయనగరం జిల్లాలో అత్యధికంగా 203 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్ధయింది. 11 ప్రాంతాల్లో 100 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యింది. ఏలూరు జిల్లాలో వర్షాల వల్ల తీవ్ర పంటనష్టం వాటిల్లింది. చాలా ఊళ్లలో ఇళ్ళు, పంట పొలాలు నీట మునిగాయి. వాగుల ప్రావాహం దాటికి రోడ్లు కోసుకుపోయాయి. పదుల సంఖ్యలో గ్రామాలకు రవాణా వ్యవస్థ స్తంభించింది. ఎర్ర కాలువ ఉధృతంగా ప్రవహించడం వాళ్ళ కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరిలో అనేక మండలాలలో తీవ్ర పంట నష్టం ఏర్పడింది. ఉత్తరాంధ్రతో పోలిస్తే దక్షిణకోస్తాలో కొంత తక్కువ వర్షపాతం నమోదయ్యింది. విజయవాడ, విశాఖపట్టణం కొండ ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడటం వల్ల చాలాసేపు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
ప్రాణ నష్టం, ఆస్థి నష్టం వాటిల్లకుండా ప్రభావిత ప్రాంత కలెక్టర్లతో, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షలు నిర్వహించారు. ఈరోజు, రేపు కూడా వర్షాలు ఎక్కువగానే ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు ప్రాంతాల్లో రెడ్ అలెర్ట్ జారీ చేసింది