»India Champions Win Inaugural Edition Beat Pakistan Champions By 5 Wickets
WCL 2024 Final: 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌పై భారత్ గెలుపు
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 లీగ్ ముగిసింది. పాకిస్థాన్‌పై భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ క్రికెటర్స్ ఇండియన్స్ లెజెండ్స్ విసిరిన బంతికి చతికీల పడ్డారు.
India Champions Win Inaugural Edition, Beat Pakistan Champions By 5 Wickets
WCL 2024 Final: వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024లో భారత్ విజేతంగా నిలించింది. జూలై 13న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ లెజెండ్స్ విజేతలుగా నిలిచారు. యువరాజ్ సింగ్ సారథ్యంలో టీమిండియా ప్రత్యర్థి పాకిస్థాన్ ఛాంపియన్లపై భారీ విజయాన్ని నమోదు చేసింది. ఐకానిక్ ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో కప్ సాధించింది. 157 పరుగుల లక్ష్యంతో బరిలో దిగినా ఇండియా అలవోకగా గెలిచింది. సోహైల్ తన్వీర్ వేసిన చివరి ఓవర్లో ఇర్ఫాన్ పఠాన్ విజయవంతమైన బౌండరీని కొట్టి విజయాన్ని భారత్‌కు విజయాన్ని అందించాడు.
మొదట బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ ఛాంపియన్స్ కాస్త తడబడ్డారు. పాక్ టాప్ ఆర్డర్ భారత బౌలింగ్‌కు పూర్తిగా విఫలమయ్యింది. దాంతో భారత్ స్పిన్, పేస్ బౌలర్లు రెచ్చిపోయారు. దాంతో 11.3 ఓవర్లలో 79/4కి పరిమితం చేసింది. అలా నిర్ణిత ఓవర్లలో 156 పరుగులు చేశారు. ఆ తరువాత బ్యాంటింగ్ చేసిన భారత్ పాకిస్థాన్ బౌలర్లును ముప్పుతిప్పలు పెట్టారు. రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు 34 పరుగుల పార్టనర్ షిప్ అందించారు. తరువాత భాతర్ వికెట్ కోల్పోయింది. ఉతప్ప ఔటయ్యాడు. మూడు ఓవర్లకు భారత స్కోరు 38/2 ఉంది. సురేష్ రైనా ఔటయ్యాడు. ఆ తరువాత అంబటి రాముడు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి అర్ధశతకం పూర్తి చేశాడు. అలాగే యూసఫ్ పఠాన్ కేవలం 16 బంతుల్లో 30 పరుగులు చేసి విజయాన్ని అందించాడు. దాంతో పాకిస్థాన్‌పై భారత్ 5 వికెట్ల తేడాతో ఛాంపియన్ షిప్‌గా నిలిచింది.