MLC Kavitha's default bail petition.. Hearing in court adjourned
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టు అయి రౌజ్ అవిన్యూ కోర్టులో విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగా కవిత మూడు నెలలకు పైగానే తీహార్ జైలులో ఉంటున్నారు. ఇది వరకు చాలా సార్లు తనకు మధ్యంతర బెయిల్ కోసం ప్రయత్నించినా ఈడీ, సీబీఐ కేసులు, చార్జిషీట్ల వేస్తూ కోర్టును విచారణకు కోరింది. తాజాగా ఈడీ విచారణ అనంతరం సీబీపీ కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టును కోరింది. ఈ మేరకు కోర్టు కవిత కస్టడీని పొడగలించింది. ఈ నేపథ్యంలో మద్యం పాలసీ కేసులో తనకు డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిపై విచారణ జరగాల్సి ఉంది.
ఈ కేసులో ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్నారు కవిత. ఈ డిఫాల్డ్ కేసులో భాగంగా మద్యం పాలసీలో కవిత పాత్ర, సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్ పలు అంశాలను పరిగణనలోకి తీసుకొని, డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలా వద్దా అనేది జూలై 22కు వాయిదా వేసింది. ఈ మేరకు ట్రయల్ కోర్టు జడ్జి కావేరి భవేజా తెలిపారు. సీబీఐ ప్రవేశపెట్టిన ఛార్జిషీట్లో తప్పులు ఉన్నాయని కవిత తరఫున సీనియర్ న్యాయవాది నితీశ్ రాణా వాదించారు.. అలాంటిది ఏం లేదని, అన్ని పక్కాగా ఉన్నాయిన సీబీఐ తరఫు న్యాయవాది వాదనలను తిప్పికొట్టారు. దీనిపై ఈ నెల 22న విచారణ జరగనుంది.
ఈ నేపథ్యంలో డిఫాల్ట్ బెయిల్ అంటే ఏంటి, అది ఎప్పుడు తీసుకుంటారు అని చాలా మందికి అనుమానం వస్తుంది. ఇటీవలే విచారణ ఎదుర్కొంటున్న నిందితులు డిఫాల్ట్ బెయిల్ పొందే హక్కు ఉందని సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చింది. సెక్షన్ 167(2) ప్రకారం, నిందితుడిని 15 రోజుల పాటు పోలీసుల కస్టడీలో ఉంచాలని కోర్టు తీర్పు ఇస్తుంది. ఒకే కేసులో అంతకు మించి కస్టడికి ఇవ్వలేదు. కోర్టు ఇచ్చిన సమయంలో నిందితుడిని నిర్దోషిగా నిరుపించకపోతే ఆ సమయంలో డిఫాల్ట్ బెయిల్ ఇవ్వొచ్చు. రాజ్యంగం ఇచ్చిన ఆర్టికల్ 21 ప్రకారం అందరికీ జీవించే హక్కు ఉంటుంది. అందుకని చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా దర్యాప్తు అధికారులు వేగంగా, సమర్ధవంతంగా పని చేస్తారు.